by Suryaa Desk | Sat, Dec 21, 2024, 01:48 PM
ప్రభాస్ ఫ్యాన్స్ సైతం దర్శకుడు సుజీత్ ని ఆడిపోసుకున్నారు. సుజీత్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు సుజీత్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈ మూవీ నార్త్ లో ఆడింది. రూ. 150 కోట్లకు పైగా వసూళ్లతో లాభాలు పంచింది. నార్త్ ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారు. మన తెలుగు వాళ్ళు మాత్రం సాహోని తిరస్కరించారు. పుష్ప 2 విషయంలో కూడా ఒకింత ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. హిందీ వచ్చినంత రెస్పాన్స్ పుష్ప 2 చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రాలేదు. టాలీవుడ్ లో కూడా పుష్ప 2 హిట్. కానీ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే తక్కువ ఆదరణ లభించింది. నార్త్ ఆడియన్స్ పుష్ప 2 ని తమ చిత్రంగా ఓన్ చేసుకున్నారు. ఇది విచిత్రమైన పరిణామం. బాలీవుడ్ రేంజ్లో పుష్ప 2 టాలీవుడ్ లో ఆడి ఉంటే.. ఎప్పుడో బాహుబలి 2 వసూళ్లను దాటేసేది. కాబట్టి పుష్ప 2, సాహో చిత్రాలు రచ్చ గెలిచి ఇంట ఓడిపోయాయి. 2021లో విడుదలైన పుష్ప కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. హిందీలో మాత్రమే వంద కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నార్త్ లో పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తుంది. పుష్ప 2 హిందీ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరో రెండు వారాలు పుష్ప 2 అక్కడ సత్తా చాటే అవకాశం ఉంది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోనుంది. అదే జరిగితే పుష్ప 2 బాహుబలి 2 రికార్డు లేపేయడం ఖాయం. ఉత్తర భారతదేశంలో పుష్ప 2 థియేటర్స్ ఎదుట భారీ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. కాగా ఆడియన్స్ ని ఆకర్షించేందుకు పుష్ప 2 మేకర్స్ గొప్ప ప్లాన్ వేసింది. పుష్ప 2 నయా వెర్షన్ అందుబాటులో తెస్తుంది. అంటే.. కొత్తగా సీన్స్ యాడ్ చేసి ప్రదర్శించనున్నారు. క్రిస్మస్ పండగ నాటి నుండి పుష్ప 2 మూవీకి అదనంగా 20 నిమిషాల సీన్స్ జోడించనున్నారట.
Latest News