by Suryaa Desk | Sun, Dec 22, 2024, 03:42 PM
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యంత పాపులారిటీ సాధించిన హీరోయిన్లలో మీనా కూడా ఒకరు. ఈమె పేరు లాగే మీనా కూడా ఎంతో అందగత్తె.. ఈమె చేసిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో అద్భుతమైన హిట్లు సాధించాయి. అలాంటి మీనా తన కెరియర్ మంచి పొజిషన్లో ఉండగానే విద్యాసాగర్ అనే ఇండస్ట్రీకి పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. హ్యాపీగా గడుపుతున్న తరుణంలోనే ఈ జంటకు ఒక కూతురు పుట్టింది.. ఆ తర్వాత మీనా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్న తరుణంలోనే కరోనా అనే మహమ్మారి వచ్చింది. ఈ సందర్భంలోనే కరోనా వల్ల తన భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం పొందారు. దీంతో మీనా జీవితం ఆగమ్య గోచరంగా మారింది. అప్పటినుంచి పలు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమెపై అనేక రూమర్లు వస్తున్నాయి. మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని, తను చేసుకోబోయేది నటుడు ధనుష్ నే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.కానీ వాటిపై ఎప్పుడు కూడా రియాక్ట్ కాలేదు. ఆ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ నేను రెండో పెళ్లి పై అసలు దృష్టి పెట్టడం లేదని చెప్పుకొచ్చింది. అలాంటి ఈ తరుణంలో తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు పొందిన సంతోష్ వర్గీస్ మీనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. నేను మీనాని పెళ్లి చేసుకుంటానని, ఆమెకి కూతురు ఉన్నా పర్లేదని, తన సొంత కూతురిలా ఆమెను చూసుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వివాదాస్పదం అయ్యాయి.
Latest News