by Suryaa Desk | Tue, Oct 15, 2024, 02:19 PM
మ్యాన్ అఫ్ మస్సెస్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా దేవర బాక్స్ఆఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని కలిగి ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 509 కోట్ల మైలురాయిని అధిగమించిందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగురాష్ట్రాలలో దేవర బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలై 18వ రోజు 1.19 కోట్లు వసూలు చేసింది. సినిమా మొత్తం 18 రోజుల తెలుగురాష్ట్రాల షేర్ 137.67 కోట్లు (జిఎస్‌టి మినహా) కి చేరుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా భారీ-టికెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. రాక్‌స్టార్ అనిరుధ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. శివ కోరటాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Latest News