by Suryaa Desk | Tue, Oct 15, 2024, 02:35 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని నటి అదాశర్మ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటిని రీమోడలింగ్ చేసిన అదా.. ఇటీవలే కుటుంబంతో సహా అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే.. ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వీటిపై అదా స్పందించారు. ఒక నటిగా తనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఇలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఆ ఇంటిని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘మన జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అభిప్రాయాలు తెలపడానికి మన దేశంలో పూర్తి హక్కు ఉంటుంది. నేను ఈ ఇంటిని కొనుగోలు చేయడంపై కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడించారు. ‘నేను మంచి వ్యక్తిని’ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు చేయాలనిపించినది నేను చేశా. నా కోసం ఎవరూ మారకూడదని నేను అనుకుంటాను. అదే రూల్ ఇతరులకు వర్తిస్తుంది. వారి కోసం నేను నా పద్ధతిని మార్చుకోను’ అని చెప్పారు. ఇక సుశాంత్ ఇంటి గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఈ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇక్కడ ఉంటున్నాను. ఈ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉంది’ అని తెలిపారు. గతంలోనూ ఈ ఇంటిపై అదా ఇలాంటి కామెంట్సే చేశారు. సుశాంత్ ఇంటిని చూడగానే తనకు ఎంతో పాజిటివ్‌గా అనిపించిందన్నారు. అందుకే కొన్నట్లు వెల్లడించారు. మొత్తం రీమోడలింగ్ చేశానన్నారు. మొదటి అంతస్తుని గుడిలా మార్చేసినట్లు చెప్పారు. ఒక గదిని మ్యూజిక్ రూమ్‌గా, మరో దాన్ని డ్యాన్స్ స్టూడియోగా చేశానన్నారు. టెర్రస్ మొత్తం గార్డెన్‌లా మార్చేసినట్లు తెలిపారు
Latest News