by Suryaa Desk | Tue, Oct 15, 2024, 04:21 PM
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' లో తదుపరి కనిపించనున్నారు. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఒక పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ చర్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా హోల్డ్ లో ఉంది. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగాడు. ఈ చిత్రానికి ఇప్పుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎపిక్ హరి హర వీర మల్లు పార్ట్-1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ షూటింగ్ పునఃప్రారంభం అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 8, 2024 నాటికి షూటింగ్ ముగుస్తుంది అని సమాచారం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్ మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మరియు ఆస్కార్-విజేత స్వరకర్త MM కీరవాణి ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై AM రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు మరియు జ్ఞానశేఖర్ మరియు మనోజ్ కె పరమహంస సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది.
Latest News