by Suryaa Desk | Tue, Oct 15, 2024, 05:07 PM
వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాని అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి శ్రీమతి గారు వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించగా, జీవీ తన గాత్రాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Latest News