by Suryaa Desk | Wed, Oct 16, 2024, 06:19 PM
బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా NBK109 అనే పేరు పెట్టారు. ఈ సినిమా టీజర్‌లు, పోస్టర్లు వైరల్‌గా మారడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు గోప్యంగా ఉంచిన టైటిల్‌ను ఈ దీపావళికి సూపర్ మాస్ టైటిల్ టీజర్ ద్వారా రివీల్ చేయనున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, చాందిని చౌదరి, రిషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
Latest News