by Suryaa Desk | Wed, Oct 16, 2024, 06:47 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి ప్రాజెక్ట్ ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'VD12' అనే టైటిల్ ని పెట్టారు. ఈ యాక్షన్ డ్రామా ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. నిర్మాతలు ఏప్రిల్‌లో షూటింగ్‌ని ప్రారంభించి, సినిమా మెజారిటీని పూర్తి చేశారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. గౌతమ్ ఈ చిత్రానికి కథ అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నవ్య స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
Latest News