by Suryaa Desk | Wed, Oct 16, 2024, 09:00 PM
కోలీవుడ్ ఫిల్మ్ లబ్బర్ పాండు తమిళనాడులో సెన్సేషన్ సృష్టిస్తుంది. హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మరో ఐదు తమిళ చిత్రాలతో పాటు విడుదలైంది. భారీ పోటీ ఉన్నప్పటికీ లబ్బర్ పాండు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సింప్ల్య్ సౌత్ సొంతం చేసుకుంది. తాజాగా డిజిటల్ ప్లాట్ఫారం, ఈ సినిమా అక్టోబర్ 18న డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంలో దినేష్ అట్టకత్తి మరియు స్వాసిక ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో స్వసిక, సంజన, కాళీ వెంకట్, దేవదర్శిని, బాల శరవణన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్, ఎ.వెంకటేష్ లబ్బర్ పండును నిర్మించారు. సీన్ రోల్డాన్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు.
Latest News