by Suryaa Desk | Wed, Oct 16, 2024, 09:22 PM
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. 2024 సంక్రాంతి సీజన్‌లో విశ్వంభర విడుదల కానందున చిరంజీవి అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కి స్థలం ఇవ్వడానికి ఈ చిత్రం వాయిదా పడింది. టీజర్ చూసిన వారంతా సినిమా వీఎఫ్‌ఎక్స్ పోర్షన్స్‌పై ఏమాత్రం సంతోషించలేదు. ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా చిరంజీవి అంత సంతోషంగా లేడని కూడా వార్తలు వస్తున్నాయి. సినిమా వాయిదా పడడానికి అసలు కారణం అదే. గ్రాఫిక్స్ పార్ట్‌ని మళ్లీ వర్క్ చేసి మరింత మెరుగ్గా చేయమని చిరంజీవి దర్శకుడిని కోరారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చిరు దర్శకుడు వివి వినాయక్ సహాయం కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఊహాగానాలే అయినా ఈ వార్త ఫిలిం సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Latest News