by Suryaa Desk | Thu, Oct 17, 2024, 03:41 PM
కోలీవుడ్ స్టార్ నటుడు శివ కార్తికేయన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని రాజ్‌కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'అమరన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా "మేజర్ వరదరాజన్" నుండి ప్రేరణ పొందింది. ఇది శివఅరూర్ మరియు రాహుల్ సింగ్ పుస్తకం, "ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్"లో ప్రదర్శించబడింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ సినిమా అప్‌డేట్ షేర్ చేయబడింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని వెన్నిలవు సారల్ అనే టైటిల్ తో విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. gv ప్రకాష్ కుమార్ ఈ సాంగ్ ని కంపోస్ చేసారు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. రాహుల్ బోస్ మరియు భువన్ అరోరా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ మరియు ఎమోషన్ మిళితమై "అమరన్" ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సహకారంతో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ CH సాయి, ఎడిటర్ R. కలైవానన్ మరియు యాక్షన్ డైరెక్టర్లు అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్‌తో సహా అమరన్ అగ్రశ్రేణి సాంకేతిక బృందంతో ఉంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన అమరన్ దేశభక్తి చిత్రం. ఈ సినిమా అక్టోబరు 31, 2024న గ్రాండ్ మల్టీ-లాంగ్వేజ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Latest News