by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:36 PM
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సిరీస్ హిట్ తర్వాత సినిమాల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఆయన లోకనాయకుడు కమల్‌హాసన్ తో 'తగ్ లైఫ్' అనే సినిమా నిర్మిస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్‌ని ఎంతో ఉత్సాహపరిచిన ఒక వార్తలో నిజం లేదని మణిరత్నం వైఫ్, సీనియర్ యాక్ట్రెస్ సుహాసిని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ గుండెకి ఆల్మోస్ట్ హోల్ పడినంత పనైంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..సరిగ్గా 33 ఏళ్ల క్రితం మణిరత్నం.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తీసిన 'దళపతి' సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే ఆ సినిమాలోని పాటలకు, సన్నివేశాలకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ ఏడాది డిసెంబర్ 12న రజినీ 75వ పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ వినిపించే ఛాన్సెస్ ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఇటు రజినీతో పాటు మణిరత్నం ఫాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇదే విషయాన్ని మణిరత్నం వైఫ్, సీనియర్ యాక్ట్రెస్ సుహాసినిని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆమె రిప్లై ఇస్తూ.. ‘ఈ విషయం వారిద్దరికి కూడా తెలియదు. కేవలం వారిద్దరి కాంబోలో సినిమా వస్తోందని ప్రచారం చేసిన వారికి మాత్రమే తెలుసు’ అంటూ కౌంటర్ ఇయ్యడంతో సంబరాలు జరుపుకున్న ఫ్యాన్స్ గుండెకి ఆల్మోస్ట్ హోల్ పడినంత పనైంది. కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థగ్ లైఫ్’. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఇందులో బడా స్టార్స్ నటిస్తుండగా.. తాజాగా మరో ఇద్దరూ నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సీనియర్ నటుడు నాజర్, అభిరామి ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థలు రాజ్‌కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు పోస్టర్లు షేర్ చేశాయి. కమల్‌హాసన్ చిత్రంలో మరోసారి భాగం కావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని అభిరామి తెలిపారు.
Latest News