by Suryaa Desk | Fri, Oct 18, 2024, 12:20 PM
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత ఓజీ టీం షూటింగ్ మూడ్‌లోకి వచ్చేసింది.. బ్యాక్ టు ఓజీ.. అంటూ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఇన్ స్టాగ్రామ్‌లో అందమైన లొకేషన్‌లో క్రేన్ ఉన్న స్టిల్‌ను షేర్ చేశాడు. ఓజీ షూటింగ్ షురూ అయిందని తెలిసిందే. డైరెక్టర్ సుజిత్, పవన్ కల్యాణ్ టీం ఫైరింగ్ మూడ్‌లో ఉంది. షూట్ లొకేషన్‌లో సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, సుజిత్, మ్యూజిక్ ఎస్ థమన్ వర్కింగ్ మూడ్‌లో ఉన్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానును కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తాజా స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన" HUNGRYCHEETAH "గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ మూవీ లో గ్యాంగ్ లీడర్ ఫేం "ప్రియాంకా ఆరుళ్ మోహన్" ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఖచ్చితంగా షాట్ పడుతుంది. మా నుండి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ వస్తుంది. సుజీత్ అగ్గి రాజేస్తే.. రవి కె చంద్రన్ ఎలివేషన్ మెయిన్ హైలెట్‌గా ఉండబోతుందని చెప్పి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు.
Latest News