by Suryaa Desk | Fri, Oct 18, 2024, 02:13 PM
బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అల్లు అర్జున్ జంటగా దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది హన్సిక. చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చిన హన్సికకు తక్కువ సమయంలోనే పేరు వచ్చింది. దీంతో వరుసగా తెలుగు తమిళ భాషల్లోే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. హన్సికను టాలీవుడ్ పెద్దగా ఆధరించలేదు కాని... తమిళంలో మాత్రం ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కింది. తర్వాత బరువు పెరగడంతో హన్సికకు సినిమా అవకాశాలు తగ్గాయి. ఈలోగా నటుడు సింబుతో ప్రేమాయణం నడిపింది. వాళ్ళు సినిమాలో జంటగా నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. కానీ కొన్నేళ్లకే వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు. బరువు తగ్గించుకుని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది హన్సక. దాంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో 2022లో తన ప్రియుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది.సోహైల్‌కి ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలి భర్తే ఈ సోహైల్. మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత హన్సికతో ప్రేమలో పడి, కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పెళ్లి జైపూర్‌లో జరిగింది.పెళ్లయినా హన్సిక సినిమాల్లో నటిస్తోంది. అగ్ర హీరోలతో నటించే అవకాశం లేకపోయినా, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది.పెళ్లయి రెండేళ్లు అవుతున్న హన్సిక, ఇప్పుడు ఒక శుభవార్త చెప్పింది. తన భర్త సోహైల్ కతూరియాతో కలిసి అందమైన బంగ్లా కట్టి, గృహప్రవేశం చేసింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కొత్త ప్రారంభం అంటూ హన్సిక పోస్ట్ చేసిన ఫోటోలకు లైక్‌లు, శుభాకాంక్షలువెల్లువెత్తుతున్నాయి. హన్సిక గృహప్రవేశంలో ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
Latest News