by Suryaa Desk | Fri, Oct 18, 2024, 03:59 PM
శృతి హాసన్ డేటింగ్ గురించి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. టిండర్ స్వైప్ రైడ్ లో భాగంగా కుశా కపిలతో ఇంటర్వ్యూలో రిలేషన్షిప్స్, డేటింగ్ లపై స్పందించింది.తన పార్ట్‌నర్ లో ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పడంతోపాటు గతంలో డేటింగ్ లో తనకు ఎదురైన కొందరు వ్యక్తుల గురించి కూడా చెప్పుకొచ్చింది.డేటింగ్ కు వెళ్లినప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలు ఖర్చు పెట్టడం కామన్. కానీ తన విషయంలో మాత్రం అది రివర్స్ అయిందని ఈ ఇంటర్వ్యూలో శృతి హాసన్ చెప్పింది. కొందరు తన దగ్గర డబ్బు బాగా ఉందంటూ తనతోనే ఖర్చు పెట్టించారని ఆమె చెప్పడం విశేషం."మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని నేను భావిస్తాను. కానీ దాని వల్ల ఇబ్బందులూ ఉన్నాయి. నేను చాలా కాలంగా ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉన్నాను. కానీ చాలాసార్లు నేను డేటింగ్ కు వెళ్లినప్పుడు అబ్బాయిలు నన్నే ఖర్చు పెట్టమనేవాళ్లు. అదేంటంటే నా దగ్గర డబ్బు బాగా ఉంది కదా అన్నది వాళ్ల ఫీలింగ్" అని శృతి చెప్పింది.
అలా ఖర్చు పెట్టడం తన ప్రేమ భాషగా తాను భావించినా.. దీని వల్ల తాను గుణపాఠం నేర్చుకున్నట్లు కూడా శృతి చెప్పింది. "నేను సరే అనేదాన్ని. నీకు ఏం కావాలన్నా తెచ్చిస్తాను. నేనే బిల్ ఇస్తాను. ఎందుకంటే అది నా స్వభావం. అది నా ప్రేమ భాష.మూడు నెలల తర్వాత మనం ఇన్నిసార్లు బయట భోజనం చేశాం కానీ నువ్వెప్పుడూ బిల్ ఇవ్వలేదు అని నేను అనేదాన్ని. కానీ నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా అని వాళ్లు అనేవారు. అక్కడే నాకు మండేది. ఇప్పుడు మాత్రం ఇద్దరం ఖర్చు భరిద్దాం అంటున్నాను" అని శృతి హాసన్ స్పష్టం చేసింది.తాను సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఉన్న వ్యక్తిని ఇష్టపడతానని శృతి చెప్పింది. రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు ఆర్థిక విషయాల్లో కాస్త సున్నితంగా ఉండాలని తానెప్పుడూ చెబుతుంటానని కూడా ఈ ఇంటర్వ్యూలో శృతి తెలిపింది. ఇద్దరూ భరించగలిగే దగ్గరికే డేటింగ్ కు వెళ్లాలనీ చెబుతోంది. శాంతను హజారికాతో చాలా కాలం డేటింగ్ లో ఉన్న శృతి ఈ ఏడాది మొదట్లో విడిపోయిన విషయం తెలిసిందే.
Latest News