by Suryaa Desk | Fri, Oct 18, 2024, 04:18 PM
జానీ మాస్టర్ ఆయన దగ్గర పనిచేసే లేడీ కొనియోగ్రాఫర్ ను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతానికి ఆయన చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఇటీవల జానీ మాస్టర్ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన తల్లి గుండెపోటుతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. జానీ మాస్టర్ కు మాత్రం వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఒక వైపు జాతీయ అవార్డు రద్దుకాగా, మరోవైపు ఆయనకు కోర్టులో బెయిల్ సైతం ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో లేడీ కొరియో గ్రాఫర్ ఆనీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచాయి.జానీ మాస్టర్ పై ఆయన దగ్గర పనిచేసిన శ్రేష్టి వర్మ తనపై లైంగిక దాడి జరిగిందని సెప్టెంబర్ 15 న రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. సదరు యువతి దగ్గర నుంచి స్టేట్ మెంట్ సైతం రికార్డు చేశారు. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ కేసులో..తాజాగా మరో లేడీ కొరియో గ్రాఫర్ ఆని మాస్టర్ స్పందించారు. ఇన్ని రోజులు జానీ మాస్టర్ ఘటన చూసి చాలా ఆందోళనకు గురయినట్లు చెప్పారు. గతంలో జానీ మాస్టర్ తో కలసి అనేక సినిమాల్లో నటించానని చెప్పారు. ఏ రోజు కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు.
సదరు యువతి.. ఇన్నేళ్లు ఆయన దగ్గర పనిచేసి, ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని అన్నారు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. జాతీయ స్థాయి అవార్డు వచ్చిన వ్యక్తికి ఆ అవార్డు రద్దు చేయడం కూడా చాలా బాధను కల్గజేసిందన్నారు. సదరు అమ్మాయి.. జానీ మాస్టర్ వల్లే.. తాను ఈ స్థాయిలో చేరుకున్నానని చెప్పి, మళ్లీ ఇప్పుడేమో.. ఇలా ఆరోపణలు, కేసులు దాక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతే కాకుండా.. గతంలో ఆరోపణలు చేసిన అమ్మాయి..ఢీ షోలో పరిచయం అయ్యిందన్నారుతనకు అవకాశాలు రావట్లేదని రోజు మెస్సెజ్ లు చేసేదని, అందుకే తానే.. జానీ మాస్టర్ లేదా శేఖర్ మాస్టర్ దగ్గరకు వెళ్లాలని సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తిమీద ఇంతటి నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. చాలా మందికి జానీమాస్టర్ అంటే ఏంటో తెలుసని.. కానీ అమ్మాయి విషయం మళ్లీ ఎందుకు కాంట్రవర్షీ అని ముందుకు వచ్చి మాట్లాడట్లేదని ఆనీ మాస్టర్ అన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మందికి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లు సహాయం చేశారని చెప్పుకొచ్చింది. తనకు కోర్టుల మీద నమ్మకం ఉందని, తొందరలోనే ఏవరేంటని, తేలీపోతుందని కూడా ఆనీ మాస్టర్ వ్యాఖ్యలు చేశారు.
Latest News