by Suryaa Desk | Wed, Nov 27, 2024, 03:39 PM
ప్రముఖ సెలబ్రిటీ జోడీ సిద్ధార్థ్- అదితీ రావ్ హైదరీ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తెలంగాణలోని వనపర్తిలో ఉన్న పురాతన గుడిలో వీరు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
Latest News