by Suryaa Desk | Sun, Nov 24, 2024, 06:52 PM
మృణాల్ ఠాకూర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2012లో ముజ్సే కుచ్ కెహెతి...ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి 2014లో 'విట్టి దండు' అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మృణాల్ ఠాకూర్ ఆ తరువాత మారుతితో పాటు హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది.తారల కెరీర్ సౌత్‌లోనూ, నార్త్ లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది కదా... జస్ట్ ఈ భాషల్లో లు చేస్తేనే కెరీర్లో ఏదో సాధించేసినట్టు కాదు. అంతకు మించి ఏదో ఉంటుందని ఆశిస్తున్నా అంటున్నారు నటి మృణాల్ ఠాకూర్.అయితే దీని గురించి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చేశారు మృణాల్ ఠాకూర్. జస్ట్ తెలుగు, హిందీ, తమిళ్ లకే తన కెరీర్ పరిమితం కాదంటున్నారు ఈ బ్యూటీ. అంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నానని చెబుతున్నారువచ్చిన కథల్లో నాకు నచ్చినవి నేను ఎంపిక చేసుకోవడం ఇంతకు ముందు జరిగింది. కానీ, ఇప్పుడు మేకర్స్ నాకోసమే స్పెషల్‌గా స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారు. సీతారామమ్, హాయ్‌నాన్న లాంటి సబ్జెక్టులు నా మీద బాధ్యతను పెంచాయి.ప్రేక్షకులు తమ ఇంటి పిల్లగా నన్ను చూసుకుంటున్నారు. అందుకే నెక్స్ట్ చేయబోయే లు అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాను అని డిక్లేర్ చేశారు మృణాల్.నాకోసమే స్పెషల్‌గా పాత్రలు రాయిస్తున్నట్టు మేకర్స్ చెబుతుంటే వినడానికి చాలా హ్యాపీగా అనిపించింది. నాకంటూ ఓ బెంచ్ మార్క్ ఉందనుకున్నప్పుడు సంతోషం వేసింది. అందుకే కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు, ప్రేక్షకులను మెప్పించే పాత్రలనే ఓకే చేస్తాను. నాకు చాలా పెద్ద కెరీర్ ఉందన్న విషయాన్ని నేనెప్పుడూ నమ్ముతాను అని అంటున్నారు మృణాల్ ఠాకూర్.
Latest News