by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:28 PM
సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఆడియెన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టికస్ట్ జ్యోతితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ ఫోటోలో శ్రీకాంత్ అయ్యంగార్‌కి జ్యోతి ముద్దు పెడుతున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ... "క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్లు మాకు పెళ్లి చేయానుకుంటున్నారా?" అనే క్యాప్షన్ పెట్టారు శ్రీకాంత్. దాంతో వైరల్ అయింది. శ్రీకాంత్ అయ్యంగార్ ఈ ఫోటోని ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు కానీ... దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్లి.. ఇద్దరికి గ్రీటింగ్స్ కూడా చెబుతున్నారు. ఇంకొందరు నెగిటివ్ కామెంట్లతో మండిపడిపోతున్నారు. మరికొందరు మనం కూడా పెళ్లికి వెళ్దాం అంటూ.. కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. 54 ఏళ్ల వయస్సులో శ్రీకాంత్ అయ్యంగార్ ఇలాంటి ఫోటోని పెట్టి... పెళ్లిపై క్యాప్షన్ పెట్టడంతో వీళ్లు పెళ్లి చేసుకుంటారని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇలా లేటు వయస్సులో పెళ్లి చేసుకోవడం టాలీవుడ్లో కామన్ అయిపోయింది. ఇటీవల సినినటుడు నరేష్, పవిత్రల పెళ్లి... దీనికి పెద్ద ఉదాహరణ.
Latest News