by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:08 PM
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం 'లక్కీ భాస్కర్' . మీనాక్షీ చౌదరి హీరోయిన్. టీజర్, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసాయి. బ్యాంకింగ్ రంగంలో మోసాలపై లాంటి కాన్సెప్ట్ కావడం ఓ వర్గానికి బాగా నచ్చింది.నిర్మాత నాగవంశీ రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ తో బజ్ క్రియేట్ చేసారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి . కాబట్టి ఈ సినిమా దీపావళిని సినిమాతో సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారికి మంచి ఆప్షన్ గా నిలిచింది. కట్ చేస్తే తొలిరోజు రూ.12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ సినిమా ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి.ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు రూ.50 కోట్లు, రూ.100 కోట్లు కలెక్షన్స్ రాబట్టడం విశేషం. దాదాపు రూ.30 కోట్లతో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.111కోట్లకుపైగా (గ్రాస్) వసూలు చేసింది . ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర టీమ్ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అందుకు నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా త్వరలో రావొచ్చని టాక్. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి సాధారణ బ్యాంకు ఉద్యోగి చేసిన రిస్క్ ఏంటన్నది ఈ సినిమా కథాంశం. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, భారతీయ మధ్య తరగతి మనస్తత్వాలు... వీటన్నిటినీ మేళవిస్తూ దర్శకుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు.
లక్కీ భాస్కర్ మొత్తం బ్యాంకింగ్ కథాంశం, అది కూడా 1990 బ్యాంకింగ్ వ్యవస్థతో సాగుతుంది. గతంలో హర్ష మెహ్రా జీవిత కథతో 1992 స్కామ్ సిరీస్ తో పాటు పలు సిరీస్ లు వచ్చాయి. అవన్నీ ప్రేక్షకులని మెప్పించాయి. అవి హర్షద్ మెహ్రా లైఫ్ చూపిస్తే ఇది హర్ష మెహ్రా వల్ల ఓ ఎంప్లాయ్ లైఫ్ లో ఏం జరిగింది అని చూపించారు. అయితే కథని మన నేటివిటీకి మార్చుకొని ఎమోషన్స్ కూడా పండించారు.
Latest News