by Suryaa Desk | Sat, Nov 23, 2024, 11:51 AM
5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్‌లో డిప్లొమా చేసింది.అలాగే ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ భామ.తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తున్న ఈ బ్యూటీకి చిన్నతనం నుంచే నటన పై ఆశక్తితో గ్రాడ్యుయేషన్ తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది. ముందుగా బుల్లితెరపై తన కెరీర్ మొదలుపెట్టింది ఈ వయ్యారి భామ.2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్ లో సోనాక్షిగా టెలివిజన్ లో తన కెరీర్‌ని ప్రారంభించింది. ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై సీరియల్ లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్, మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది.2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబి చిత్రంలో కథానాయకిగా ప్రధాన పాత్రలో సీని అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. 2018లో వీరే కి వెడ్డింగ్ అనే ఓ హిందీ లో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.తర్వాత 2018లో ఆర్ఎక్స్100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడిగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ లో కథానాయకిగా నటించింది. 2023లో వచ్చిన మంగళవారం అనే చిత్రంతో ఆకట్టుకుంది.
Latest News