by Suryaa Desk | Sat, Nov 23, 2024, 11:34 AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకున్న తర్వాత వస్తోన్న కథనాలపై వారి తనయుడు అమీన్ స్పందించాడు. తన తండ్రి గురించి వస్తోన్న అసత్య వార్తలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నాడు. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆయన ఎంతో గొప్పవ్యక్తి అన్నాడు. అవాస్తవాలు వ్యాప్తిచేయడం దయచేసి ఆపండి. ఆయన్ని, వృత్తిని గౌరవిద్దాం అని అమీన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.ఇక ఈ నెల 19న ఏఆర్ రెహమాన్, సైరాల విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం రెహమాన్ బృందంలోని మోహినీ దే అనే అమ్మాయి కూడా తన భర్త, తాను విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో రెహమాన్, మోహినీ ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనక ఏదో కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే అమీన్, రహీమా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు.
Latest News