by Suryaa Desk | Wed, Nov 27, 2024, 03:49 PM
ఆర్టిస్టుగా ప్రతిభ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ ఆపలేరు అని అంటున్నారు. కృతీ సనన్ గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ఆమెపాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో బంధు ప్రీతి గురించి కృతీ సనన్ మాట్లాడిన వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ''నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు మంచి ఆహ్వానమే లభించింది. అయితే ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేనప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పట్టడం సహజమే.మేగజీన్స్‌లో మన ఫొటోలు కనిపించేందుకు కూడా సమయం పటొచ్చు. ఇదంతా స్ట్రగుల్‌లో భాగమే. అయితే రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత, ప్రతిభతో, బాగా కష్టపడితే ఏదీ ఆపలేదు'' అని అన్నారు. ఇంకా ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి కృతీ చెబుతూ- ''బంధుప్రీతి అపవాదు మొత్తం బాధ్యతను ఇండస్ట్రీయే మోయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ విషయంలో ప్రేక్షకుల భాగస్వామ్యం కూడా ఉంది. స్టార్ కిడ్స్ అంటూ మీడియా వాళ్లు వారిపై ప్రత్యేక ఫోకస్ పెడతారు. దీంతో ఆడియన్స్ స్టార్ కిడ్స్‌ను ఫాలో అవుతుంటారు. స్టార్ కిడ్స్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి, స్టార్ కిడ్స్‌తోనే సినిమాలు తీయాలని నిర్మాతలు అనుకుంటారు. అయితే ఆడియన్స్‌కు కనెక్ట్ కాని వారు ఎవరూ ఇండస్ట్రీలో ఉండలేరు. అది నిజం. ప్రతిభ ఉన్నవాళ్లే ఉంటారు'' అన్నారు.
Latest News