by Suryaa Desk | Tue, Dec 24, 2024, 04:29 PM
రీసెంట్ గా మన తెలుగు సినిమాకి సంబంధించి వచ్చిన పలు ఊహించని కాంట్రవర్సీలు సున్నితమైన అంశాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. వీటిలో సినిమాల పరంగానే కాకుండా కొందరు తారల పర్శనల్ లైఫ్ కి సంబంధించిన అంశాలు కూడా లేకపోలేదు.అయితే ఈ అన్నిటిలో కూడా ఎక్కువగా కనిపించినవి లైంగిక వేధింపులు సంబంధిత వార్తలే అని చెప్పాలి.కొన్ని నెలల క్రితం పుష్ప నటుడు జగదీశ్ నుంచి ఆ తర్వాత జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ వీరి తర్వాత జానీ మాస్టర్ సహా లేటెస్ట్ గా ప్రసాద్ బెహరా వరకు వారి పర్శనల్ లైఫ్ కి సంబందించిన అంశాలు కొన్ని బయటకి వచ్చి హాట్ టాపిక్ గా మారాయి. కాగా వీరిలో జానీ మాస్టర్ కేసు ఒకెత్తు అని చెప్పాలి.
జానీ మాస్టర్ టాలీవుడ్ సహా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో క్రేజీ డాన్స్ స్టెప్పులు వేసి నేషనల్ అవార్డు అందుకున్నారు. కానీ ఇన్నేళ్ళలో పడ్డ కష్టం ఒక ఆరోపణతో మచ్చ పడిపోయింది. తాను నిజంగానే ఓ అమ్మాయిని వేధించాడా లేదా అనేది పక్కన పెడితే మొదటిగా తాను మాత్రం అందరి ముందు దోషిలా నిలబడ్డాడు.దాదాపు మనదేశంలో మొదట పురుషుడి వైపే తప్పుందని చాలా మంది అంటుంటారు. ఇలానే జానీ మాస్టర్ విషయంలో తాను జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తనకి రావాల్సిన మరో నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ మళ్ళీ జానీ మాస్టర్ తన పనుల్లో బిజీ అవుతున్నాడు. బయటికి వచ్చిన తర్వాత చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
జానీ మాస్టర్ కి మెగా కుటుంబం నుంచి సపోర్ట్ ఉందని చాలా మందికి తెలిసిందే. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తాను చాలా సినిమాలు వర్క్ చేయడం లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ కి కూడా తాను వర్క్ చేసాడు. అయితే తాను బయటికి వచ్చాక చరణ్ గారు కేసు గురించి ఏమాత్రం మాట్లాడలేదు.. నా వర్క్ నన్ను చేసుకోమన్నారు. కొంచెం ప్రశాంతంగా ఉండమని సూచించారు అని జానీ మాస్టర్ తెలిపారు. వర్కౌట్స్ లాంటివి చేస్తూ ప్రశాంతంగా ఏ ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పారు అంటూ ఆయన వెల్లడించారు.
అలాగే నెక్స్ట్ మరో సినిమాకి కూడా ఆఫర్ ఇచ్చినట్టుగా ఇపుడు టాక్. చరణ్ కోసం ఇంత మాట్లాడిన జానీ మాస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఇదే మీడియాతో అల్లు అర్జున్ గురించి ప్రశ్న వేస్తే దానిని దాటవేసేసి ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీనితో అతని ఇష్యూ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆల్రెడీ జానీ మాస్టర్ కి అల్లు అర్జున్ దూరం పెరిగింది అని ఫిలింనగర్ టాక్. ఈ నేపథ్యంలో చరణ్ ఒక్కడి కోసం మాట్లాడి అల్లు అర్జున్ గురించి జానీ మాస్టర్ మాట్లాడకపోవడం అనేది మరిన్ని ప్రశ్నలకి దారి తీస్తుంది అని చెప్పొచ్చు.
Latest News