![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 11:46 AM
రుషికిరణ్, శివయాదవ్, శ్వేత, రూప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సస్పెక్ట్’. రాధాకృష్ణ దర్శకత్వంలో కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ అమ్మాయి హత్య చుట్టూ సాగే కథ ఇది. హంతకులు ఎవరు?, వారిని పట్టుకొనేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో సినిమా ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రనిర్మాత కిరణ్‌కుమార్ చెప్పారు. ఈ చిత్రానికి డీఓపీ: రాఘవేంద్ర, సంగీతం: ప్రజ్వల్ క్రిష్
Latest News