|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 06:26 PM
బాలీవుడ్ నటి షెఫాలి షా తన మొదటి వైవాహిక జీవితంలోని చేదు అనుభవాలను పంచుకున్నారు. 'ఒకరు తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప, ఒంటరిగానైనా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు' అని ఆమె అన్నారు. మంచి సంబంధం లేకపోతే అది నరకంలా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని ఒంటరిగానైనా జీవించవచ్చని ఆమె తెలిపారు. తన జీవితంలోనూ అలాంటి పరిస్థితి ఎదురైందని, అప్పుడు ధైర్యంగా రిస్క్ తీసుకున్నానని షెఫాలి చెప్పారు. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు తాను పిజ్జాను కాదని ఆమె అన్నారు. షెఫాలి చివరిగా 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 3 వెబ్ సిరీస్‌లో కనిపించారు.
Latest News