|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 02:03 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభాస్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మైక్ పట్టుకుని తన అభిమానులను "డార్లింగ్స్, ఎలా ఉన్నారు?" అంటూ పలకరించారు. ఆయన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, 2026 సంక్రాంతికి విడుదల కానున్న అన్ని చిత్రాలు భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. "సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీవిజయవంతం అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. మాది కూడా హిట్టయిపోతే హ్యాపీ" అని అన్నారు. "ఒక విషయం చాలా ముఖ్యం, సీనియర్స్ అంటే సీనియర్సే. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకుంటాం. సీనియర్స్ తర్వాతే మేము " అని వినమ్రంగా చెప్పారు. తమ తరం నటుల విజయాల వెనుక సీనియర్ల నుంచి నేర్చుకున్న అనుభవమే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Latest News