|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 02:44 PM
మోహన్‌లాల్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'వృషభ' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ అంచనాలతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి తీవ్రమైన తిరస్కరణకు గురైంది. రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే వసూలు చేసి, ట్రేడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.సినిమా వసూళ్ల గ్రాఫ్ రోజురోజుకు దారుణంగా పడిపోతోంది. విడుదలైన తొలిరోజు (గురువారం) రూ.60 లక్షలు రాబట్టిన 'వృషభ', రెండో రోజు (శుక్రవారం) నాటికి 46 శాతం క్షీణించి రూ.32 లక్షలకు పడిపోయింది. ఇక మూడో రోజైన శనివారం నాటికి వసూళ్లు మరింత తగ్గి, కేవలం రూ.19 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్యలోనే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మూడు రోజుల మొత్తం వసూళ్లు రూ.1.11 కోట్లకు చేరాయి.
Latest News