|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 12:06 PM
హీరో అజిత్, ఆయన భార్య షాలిని ఒక హోటల్‌లో సందడి చేశారు. ఈ వీడియోలో షాలిని.. తన భర్తను ఆటపట్టించారు. నేను చెప్పినట్లుగా చేసావా? అంటూ అజిత్‌ను సరదాగా అడిగింది. ఆ తర్వాత అజిత్ దంపతులకు తాము అతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని ఎఫ్‌సీ మద్రాస్ పేర్కొంది. మనదేశానికి మోటార్‌స్పోర్ట్స్.. అలాగే దేశాన్ని ప్రపంచ రేసింగ్ పటంలో నిలపాలన్న అజిత్ కుమార్ దార్శనికత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. క్రీడలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఛాంపియన్‌లను తయారు చేయడంలో.. భారతదేశంలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో అజిత్‌తో కలిసి పనిచేస్తామని ఎఫ్‌సీ మద్రాస్ ప్రకటించింది.ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి జత కట్టనున్నారు. ఇంకా ఈ మూవీ పనులు ప్రారంభించలేదు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే అజిత్ కుమార్ మోటార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటున్నారు.
Latest News