|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 11:49 AM
హిందీ వెబ్ సిరీస్ ‘చిరైయా’ కథను సమర్థిస్తూ, పురుషుల మైండ్‌సెట్‌ను ప్రశ్నిస్తూ గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేశారు. వైవాహిక అత్యాచారం అనే సున్నితమైన అంశాన్ని ఈ సిరీస్ చర్చిస్తుందని, పెళ్లైనప్పటికీ భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొంటే అది కూడా అత్యాచారమేనని ఆమె పేర్కొన్నారు. అశ్లీల కంటెంట్ ప్రభావం వల్ల కొంతమంది పురుషుల్లో తప్పుదారి పట్టిన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయన్నారు. వైవాహిక జీవితంలో పరస్పర సమ్మతి అత్యంత ముఖ్యమని ఆమె తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.
Latest News