|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 04:03 PM
బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన యాంకర్ శ్రీముఖి ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో 'ఫుర్సత్' అనే పేరుతో ఒక భారీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తన వ్యాపార భాగస్వాములు శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ, తనకు భోజనం అంటే ప్రాణమని, ముఖ్యంగా చికెన్ వంటకాలు, బిర్యానీ అంటే చాలా ఇష్టమని తెలిపారు. 'ఫుర్సత్' అనేది కేవలం ఒక హోటల్ కాదని, అది ఒక అనుభూతి అని, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి ఇది సరైన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు.
Latest News