|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 03:19 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ తన 111వ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో నటించడం దాదాపు ఖాయమైంది. 'వీరసింహారెడ్డి' తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో 'భగవంత్ కేసరి'లో కలిసి నటించిన వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. కాజల్ త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనుంది, మే నెల మొత్తం ఆమె డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఆమె పాత్రపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Latest News