|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 02:36 PM
సినీ నటి తేజస్వి మదివాడ జీవితం కష్టాలతో నిండి ఉంది. తల్లి చిన్నప్పుడే మరణించగా, తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆమె అనాథాశ్రమంలో పెరిగి, ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంది. రెండేళ్లపాటు పానీపూరి తిని కడుపు నింపుకున్నానని ఆమె ఒక సందర్భంలో తెలిపారు. జర్నలిజం చదివిన తేజస్వి, నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసింది. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు పొంది, 'ఐస్ క్రీమ్' సినిమాలో సోలో హీరోయిన్‌గా నటించింది. కెరీర్‌లో ఎక్కువగా సెకండ్ లీడ్ పాత్రలు పోషించినా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌కు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Latest News