|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 02:48 PM
సీనియర్ నటి జయప్రద కుమారుడు సామ్రాట్ హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. సామ్రాట్ ఇప్పటికే నటన, ఫైట్స్, డాన్స్‌లలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఒక స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. జయప్రద స్వయంగా కథా చర్చల్లో పాల్గొంటూ, టెక్నికల్ టీం విషయంలో కూడా రాజీ పడకుండా ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చర్చ నడుస్తోంది.
Latest News