|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 10:29 AM
'పోకిరి' సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ ఇలియానా అభిమానుల రద్దీలో ఇరుక్కుపోయి ఇబ్బంది ఎదుర్కోన్నారు. ఈ ఘటనతో మహేష్ బాబు, ఇలియానాకు క్షమాపణ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన అభిమానుల వల్ల ఇలియానా ఇబ్బంది పడాల్సి వచ్చిందని మహేష్ బాబు భావించి, ఆమెకు సారీ చెప్పారని తెలిసింది. ఈ సంఘటన మహేష్ బాబు సంస్కారాన్ని, తన అభిమానుల పట్ల ఆయన బాధ్యతను తెలియజేస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు.
Latest News