|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 03:16 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు 'అన్నా కొణిదెల'గా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఖాతా ప్రారంభించగానే అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆమె తొలి పోస్టులో తన వ్యక్తిత్వాన్ని, రెండు సంస్కృతుల సమ్మేళనంగా జీవిస్తున్నానని తెలియజేశారు. భర్త పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. చిరంజీవి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపారు. ఆమె ఖాతా ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఫాలోవర్స్ సంఖ్య లక్ష దాటింది.
Latest News