|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 11:41 AM
AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని బుధవారం సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కన్నడ నటి తార, దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చి రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖుల రాకతో తిరుమలలో భక్తుల సందడి పెరిగింది.
Latest News