|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:20 PM
RX100 సినిమాతో సంచలనం సృష్టించిన హీరో కార్తికేయ, 'గ్యాంగ్ లీడర్', 'వలిమై' వంటి చిత్రాల్లో విలన్‌గానూ మెప్పించారు. 'భజే వాయు వేగం' తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పుట్టినరోజు సందర్భంగా, తన తదుపరి చిత్రంపై 'వర్క్ ప్రోగ్రెస్ లోనే ఉంది, బ్లాస్టింగ్ అప్డేట్ తో వస్తాను' అని ట్వీట్ చేశారు. అయితే ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగానే ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మంచి టాలెంట్ ఉన్న కార్తికేయ సమయం వృధా చేయకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Latest News