|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:12 PM
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రపంచ శాంతి, ఐక్యతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ వీడియో పోస్ట్ చేశారు. అయితే, కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడంతో, నోరా స్పందిస్తూ 'చాలా మందిలో విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుంది. శాంతియుతంగా జీవించాలని నేను ప్రపంచంలోని ప్రజలందరి గురించి మాట్లాడాను. నా మాటలతో మీకు సమస్య ఉంటే నైతికంగా మీలోనే ఏదో లోపం ఉన్నట్టు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Latest News