|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:54 PM
టాలీవుడ్‌లో హోమ్లీ ఇమేజ్‌తో మెప్పించిన నటి లయ, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వెండితెరపై మెరవనున్నారు. శివాజీతో కలిసి ఆమె నటించిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్స్‌లో లయ తన కొత్త ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సినిమాలో తన పాత సాఫ్ట్ ఇమేజ్‌కు భిన్నంగా ‘ఉత్తర’ అనే స్వార్థపరురాలైన భార్య పాత్రలో కనిపిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. భర్తను (శివాజీ) ముప్పుతిప్పలు పెట్టే ఈ పాత్ర, కథలో చాలా కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం ఏడుపుగొట్టు పాత్రలకే పరిమితం కాకుండా, సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్‌ఫుల్ రోల్స్ చేయాలని ఉందని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం జగపతిబాబుతో కలిసి ‘వదలా’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో పాటు, శ్రీకాంత్‌తో ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. కథలో బలం ఉంటే చిన్న పాత్రలకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈటీవీ విన్, శివాజీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Latest News