|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 12:22 PM
భారతీయ సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మరణం పట్ల సంగీత జ్ఞాని ఇళయరాజా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమెను కేవలం గాయనిగానే కాకుండా, తోబుట్టువులా ప్రేమించిన 'ప్రియమైన సోదరి'గా అభివర్ణించారు. చెన్నైకి వచ్చినప్పుడల్లా తనను తప్పకుండా కలిసేవారని, తనపై చూపిన గౌరవం, ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఇళయరాజా పేర్కొన్నారు. ఆశా భోంస్లే స్వరం విలక్షణమైనదని, ఆమె ప్రతిభ అంతులేనిదని, ఆమె స్వరం చిత్ర ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు.
Latest News