|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 12:13 PM
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి‘. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక రూపంలో లీకులు జక్కన్నకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. గతంలోనే మహేష్ బాబు మరియు మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఒక కీలక సన్నివేశానికి సంబంధించిన క్లిప్ బయటకు వచ్చి హల్చల్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఒక భారీ యాక్షన్ విజువల్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది.
Latest News