|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 10:58 AM
విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా నటిస్తున్న 'నాగబంధం' మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ నుంచి రెండో పాట ఆదివారం విడుదలైంది. ఇది సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందాన్ని, ఉత్సాహాన్ని ప్రతిబింబించే వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్ అని చిత్ర యూనిట్ వివరించింది. జునైద్ కుమార్, అభే కంపోజ్ చేసిన ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ, కాసర్ల శ్యామ్ సాహిత్యం అదనపు ఆకర్షణగా నిలవనుంది. అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ పాడారు. ఈ పాన్ ఇండియా చిత్రం జులై 3న విడుదల కానుంది.
Latest News