|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:13 PM
నటుడు రాజేంద్రప్రసాద్ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం పట్ల తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల వివాదం ఆయన క్షమాపణతో ముగిసిన నేపథ్యంలో విశాల్ స్పందించారు. ఇది రాజేంద్రప్రసాద్ గారి నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని అభినందించారు.ఎంజీఆర్‌ను అభిమానించే ఎంతోమంది ఆయన వ్యాఖ్యలతో బాధపడ్డారని, ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) వివరణ కూడా కోరిందని విశాల్ గుర్తుచేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడాన్ని తాను మెచ్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Latest News