|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 02:26 PM
చిత్ర పరిశ్రమలో ప్రస్తుత పోకడలపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి దర్శకులు ప్రతిభ కంటే సోషల్ మీడియా ఫాలోయింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని, కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. 'ఈ రోజుల్లో చాలా మంది దర్శకులు కేవలం ఇన్‌స్టాగ్రామర్లనే సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ఒక నటుడికి ఎన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారన్నదే ముఖ్యం తప్ప వారికి ఎంత నటన వచ్చు అనేది ఎవరూ చూడటం లేదు' అని ఆమె అన్నారు. 'ధూరందర్ 2' దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం నటన సామర్థ్యం ఉన్న నిజమైన నటులను మాత్రమే ఎంచుకున్నారన్నారు.
Latest News