|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 02:49 PM
అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణేతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌లు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే తరహాలో తాజాగా అనుష్క శర్మ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ వార్తలను అనుష్క శర్మ పీఆర్ టీం తీవ్రంగా ఖండించింది. క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న అనుష్క ప్రస్తుతం పిల్లల సంరక్షణలో తీరిక లేకుండా గడుపుతున్నారు. 'చక్దా ఎక్స్ ప్రెస్' సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. దీంతో అనుష్క కెరీర్‌పై ప్రేక్షకులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది.
Latest News