|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 11:20 AM
భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండవ భాగం విడుదల కానుంది. రామ నవమి సందర్భంగా చిత్రబృందం ఈ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 2వ తేదీన, హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
Latest News