|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 12:32 PM
సినీ నటి హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్‌పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనపైనా, తన కుటుంబంపైనా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని హన్సిక ఆరోపించారు. నాన్సీ గతంలో సోషల్ మీడియాలో గృహహింస, మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే, డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే నాన్సీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని హన్సిక కోర్టులో తెలిపారు. కోర్టు నాన్సీకి హన్సిక కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేయవద్దని, వివాదాస్పద వీడియోలను తొలగించాలని ఆదేశించింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ కూడా భార్య ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్టు తుది తీర్పు కీలకం కానుంది.
Latest News