|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 12:36 PM
నటుడు తిరువీర్ 'పాపం ప్రతాప్' అనే గ్రామీణ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 1990ల నాటి గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథలో, ప్రతాప్ అనే టైటిల్ రోల్‌ను తిరువీర్ పోషిస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తిరువీర్ మాట్లాడుతూ, 'ఏప్రిల్ 17న జరిగే GT vs KKR మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉంటుందో నాకు తెలుసు, కానీ మా సినిమా ఆ మ్యాచ్ కన్నా బాగుంటుంది. మీరు థియేటర్లకు రండి, మిమ్మల్ని ఏమాత్రం నిరాశ పరచను' అని హామీ ఇచ్చారు.
Latest News