|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:21 PM
బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తన కుమారుడు అహాన్ శెట్టి నటించిన 'బోర్డర్ 2' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసే వరకు తాను చూడనని, ఒక పంతం పెట్టుకున్నానని ఆయన స్పష్టం చేశారు. జనవరి 23న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇటీవల ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2026'లో సునీల్ శెట్టి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ‘దేశభక్తితో కూడిన ఈ సినిమా రూ.500 కోట్లు సాధించాలని నేను సినిమా రాకముందే గట్టిగా అనుకున్నాను. ఆ మార్క్ దాటిన తర్వాతే చూస్తానని మొక్కుకున్నా. ప్రస్తుతం సినిమా రూ.489 కోట్ల వద్ద ఉంది. మరో రూ.10-11 కోట్లు ఒక తండ్రి ప్రేమ కోసం దేవుడు ఇస్తాడని ఆశిస్తున్నా’ అని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
Latest News